వరల్డ్ కప్ మ్యాచ్‌లకు దూరం కావడంపై హార్దిక్ పాండ్యా ఎమోషనల్

by Javid Pasha |
వరల్డ్ కప్ మ్యాచ్‌లకు దూరం కావడంపై  హార్దిక్ పాండ్యా ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ వేసే సమయంలో హార్దిక్ చీలమండకు గాయమైంది. దీంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతుండగా.. గాయం ఇంకా తగ్గలేదు. దీంతో టోర్నీ నుంచి హార్దిక్ పాండ్యాను తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఈ క్రమంలో కీలకమైన వరల్డ్ కప్ మ్యాచ్‌లకు దూరం కావడంపై హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. సొంత గడ్డపై జరుగుతున్న ముఖ్యమైన వరల్డ్ కప్ మ్యాచ్‌లకు దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. గాయం కారణంగా అర్థంతరంగా బయటకు రావడం బాధగా ఉందని అన్నాడు. ఈ సారి మనకే ట్రోఫీ వస్తుందని హార్దిక్ పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story