- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అందులో 20 బంగారు బిస్కెట్లు
దిశ, వెబ్ డెస్క్: నెల రోజుల్లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 16.73 కోట్లు అని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. జూన్ 11వ తేదీ నుంచి జూలై 10 వరకు 2,50,176 మంది భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఓ అజ్ఞాత భక్తుడు శ్రీవారి హుండీలో 20 బంగారు బిస్కెట్లు వేశారని, ఒక్కొక్క బిస్కెట్ బరువు 100 గ్రాములు ఉన్నట్టు గుర్తించామని, వీటి మొత్తం విలువ కాస్త అటు ఇటుగా కోటి రూపాయల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. భక్తుల తలనీలాలతో రూ.7 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. జూలై 10వ తేదీ వరకు తిరుమలలో 1,865 మంది టీటీడీ ఉద్యోగులకు, అలిపిరి వద్ద 1,704 మంది టీటీడీ ఉద్యోగులకు, 631 మంది భక్తులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. టీటీడీ ఉద్యోగుల్లో 91 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని వివరించారు.