దారుణం.. అఫైర్‌ బయటపెడుతామంటూ ఆంటీని రేప్ చేశారు..!

by Anukaran |   ( Updated:2021-12-17 07:26:18.0  )
Rape
X

దిశ, వెబ్‌డెస్క్: బోరబండలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళను బెదిరించిన యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. వివాహేతర సంబంధాన్ని బయటకు చెబుతామని హెచ్చరిస్తూ.. తమ కోరిక తీర్చాలంటూ అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటనను బయటకు చెప్పుకోలేని బాధితురాలు, ప్రియుడు వెంకట్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. వికారాబాద్‌ అడవుల్లో పురుగుల మందు తాగేశారు. ఇది తెలుసుకున్న బంధువులు ఆస్పత్రికి తరలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డ వీరిద్దరూ న్యాయం కోసం, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్సార్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను(ఇస్మాయిల్, యాసిన్‌లను) అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story