గిద్దలూరులో విషాదం.. ఇద్దరిని మింగిన మృత్యుశకటం

by Anukaran |   ( Updated:2020-07-31 21:59:04.0  )
గిద్దలూరులో విషాదం.. ఇద్దరిని మింగిన మృత్యుశకటం
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మార్కెట్ యార్డు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు.

అనంతరం కేసు నమోదు చేసుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story