కాలువలోకి కారు.. శాశ్వత నిద్రలోకి తల్లీకొడుకు

by Anukaran |
కాలువలోకి కారు.. శాశ్వత నిద్రలోకి తల్లీకొడుకు
X

దిశ, వెబ్ డెస్క్: కారు ప్రమాదానికి గురై తల్లీకొడుకు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాలో మంగళవారం ఓ కారు తాడేపల్లి మండలం పెనుమాక నుంచి నాగాయలంకకు వెళ్తోంది. అలా వెళ్తున్న ఆ కారు విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లి, పెద్ద కొడుకు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిలో ఒకరు 11 నెలల చిన్నారి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story