పురానాపుల్‌లో ఇద్దరు యువకులు మృతి

by Sumithra |
పురానాపుల్‌లో ఇద్దరు యువకులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విద్యుత్ స్తంభానికి బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం పురానాపుల్ లో బైక్ పై ఇద్దరు యువకులు వెళ్తున్నారు. అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో ఆ యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story