- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
1993 ముంబై పేలుళ్ల దోషి యూసుఫ్ మెమన్ మృతి
by Shamantha N |
X
ముంబయి: 1993 ముంబై వరుస పేలుళ్లలో దోషి, పరారీలో ఉన్న టైగర్ మెమన్ సోదరుడు యూసుఫ్ మెమన్ మహారాష్ట్రలోని నాసిక్ జైలులో శుక్రవారం మృతి చెందాడు. అతని మృతికి కారణాలు తెలియరాలేదు అని, ఇంకా నిర్ధారించాల్సి ఉన్నదని జైలు అధికారి ఒకరు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధూలేకు తరలించినట్టు వివరించారు. 1993 ముంబై వరుస పేలుళ్లలో ప్రధాన పాత్రధారులుగా టైగర్ మెమెన్, పరారీలో ఉన్న గ్యాంగ్ స్టార్ దావూద్ ఇబ్రహీంలను భావిస్తారు. ఈ పేలుళ్లకు సంబంధించి ఉగ్ర కార్యకలాపాలు సాగించేందుకు యూసుఫ్ తన ఫ్లాట్, గ్యారేజీలను వాడుకోవడానికి అవకాశం ఇచ్చాడని ఆరోపణలున్నాయి. ఈ కేసులో యూసుఫ్ మెమన్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ టాడా ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన మరో సోదరుడు యాకుబ్ మెమెన్ ను 2015లో ఉరి తీసిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story