- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కరోజు ప్రధాని
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ప్రధాని పదవి చేపట్టిన అతి చిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కిన సనా మారిన్.. ఏడాది తిరగక ముందే ఒక్కరోజు ప్రధానిగా 16 ఏళ్ల అమ్మాయికి బాధ్యతలు అప్పగించారు. దక్షిణ ఫిన్‌ల్యాండ్‌లోని వాస్కీకి చెందిన ఆవా ముర్టో అనే బాలిక బుధవారం ఫిన్‌ల్యాండ్ ప్రధానిగా వ్యవహరించింది. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న ఆవా ముర్టో.. మొదట ఛాన్సలర్ ఆఫ్ జస్టిస్‌తో సమావేశమైన అనంతరం పార్లమెంటు వెలువల ఆవరణలో మీడియాతో మాట్లాడింది. చట్టం గురించి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్లు తెలిపింది. టెక్నాలజీలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు రాణించలరన్న విషయాన్ని గ్రహించాలని ఆవా ముర్టో పేర్కొంది. యువత వినూత్నంగా ఉండాలని, భవిష్యత్తు గురించి మరింత ఆలోచించాలని చెప్పింది.
ఒక్క రోజు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన ముర్టోతో అసలు ప్రధాని సనా మారిన్ అల్పాహారం చేయాలనుకున్నారు. కానీ అది చివరి నిమిషంలో రద్దయింది. సాయింత్రం వారిద్దరూ ముచ్చటించుకున్నారు. రాబోయే సంవత్సరాల్లో పూర్తి సమయం ఇలాంటి బాధ్యతలు నిర్వర్తించడానికి ఆసక్తి ఉందా అని అడిగినప్పుడు ముర్టో “అవకాశం వచ్చినప్పుడు తప్పక ఆలోచిస్తానని వివరించింది.
ఈనెల 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి బుధవారం గర్ల్స్ టేకోవర్ కార్యక్రమాన్ని నిర్వహించింది అక్కడి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ముర్టో ఒక్క రోజు ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది.స్త్రీ పురుష సమానత్వ భావనను చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.