పోర్న్ కేసులో రాజ్‌కుంద్రాకు మరో షాక్..

by Jakkula Samataha |   ( Updated:2021-07-27 05:58:07.0  )
raj-kundra
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్‌‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో పోర్న్ వీడియోగ్రఫీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. తాజాగా మరో 14 రోజులు ఆయన కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

రాజ్ కుంద్రా జ్యూడీషియల్ కస్టడీ నేటితో ముగియనుండగా.. ముంబై పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. అతని ల్యాప్‌ట్యాప్‌లోని డేటాపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు కస్టడీ పొడగించాలని పోలీసులు కోరారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం కస్టడీని పెంచింది. ఇదిలాఉండగా, ఈ కేసులో త్వరలోనే ED (ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు దర్యాప్తు జరపనున్నారు.

అమ్మాయిలు డోంట్ వర్రీ.. ఐయామ్ సింగిల్‌ : మీజాన్

Advertisement

Next Story

Most Viewed