- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
14 కిలోల ఎండు గంజాయి పట్టివేత
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అక్రమంగా గంజాయి తరలిస్తున్నరాన్న సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ సిబ్బంది దాడులు నిర్వహించారు. దాడుల్లో 14 కిలోల ఎండు గంజాయిని పట్టుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎన్ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నందగోపాల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల తన చాంబర్ లో గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలకేంద్రంలో గంజాయి సరఫరా అవుతుందన్న పక్కా సమాచారంతో కాపుకాసి పిట్లం బస్టాండ్లో బస్సు ఎక్కుతుండగా నిందితులు మంజునాథ్, ఆశోక్‌లను అరెస్టు చేయడం జరిగిందని అన్నారు.
వారిరువురిని విచారించగా వారి వద్ద నుంచి సుమారు 2 కిలోలు గల 7 ప్యాకెట్ల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు 2లక్షల 40వేలు ఉంటుందని పేర్కొన్నారు. వీరు ముంబైకి చెందిన వారిగా గుర్తించామని పెద్దకొడపల్ మండలం పోచారం గ్రామం రూపా, పడవల్ నుంచి వీరు ఎండు గంజాయిని ఒక్క ప్యాకెట్ను పది వేలకు తీసు కుని ముంబై తీసుకెళ్లడానికి బస్సు ఎక్కుతుండగా ఎవీరిని అదుపులోకి తీసు కున్నామని తెలిపారు. రూపాపడవల్ పరారిలో ఉన్నాని వీరిపై ఎన్ పీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామని బిచ్కుద స్టేషన్ కు అప్పగించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ దీపికా, ఎస్సైలు సృజన, గోపాల్ రావు, హెడ్ కానిస్టేబుల్స్ నారాయణరెడ్డి, శంకర్, ఉత్తం, శివ, అమిద్ పాల్గొన్నారు.