పంజాగుట్ట యువతి కేసులో షాకింగ్ ట్విస్ట్ !

by Anukaran |
పంజాగుట్ట యువతి కేసులో షాకింగ్ ట్విస్ట్ !
X

దిశ, వెబ్ డెస్క్: పంజాగుట్ట యువతి కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. సోమవారం ఆ యువతి మీడియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు చెప్పింది. తనపై 139 మంది అత్యాచారం చేయలేదని, డాలర్ భాయ్ ఆ విధంగా కేసు పెట్టమంటేనే తాను కేసులు పెట్టానని బాధిత యువతి చెప్పుకొచ్చింది. డాలర్ భాయ్ తన పట్ల సైకోలా వ్యవహరించేవాడని తెలిపింది. ఫొటోలు, వీడియోలు తీసి నన్ను బెదిరించేవాడని, ప్రెస్ మీట్ లో ఏం చెప్పాలో రాత్రిపూట డిక్టేట్ చేసేవాడని, మొత్తం డాలర్ చెప్పినట్లే చేశానని, అతను చెప్పిన విధంగానే నాతో ప్రమేయం లేనివారిపై కూడా కేసులు పెట్టించాడని ఆ యువతి చెప్పింది. నా వల్ల అమాయకులకు శిక్ష పడకూడదని ఆ యువతి చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story