ఏపీలో 13వేలు దాటిన కరోనా కేసులు

by srinivas |
ఏపీలో 13వేలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 755 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలో 13,098 చేరింది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 12 మంతి మృతిచెందారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 169కి మృతుల సంఖ్య చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 7,021 ఉండగా, వైరస్ బారిన పడి కోలుకున్న వారు 5,908 మంది ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా కృష్టాలో 53, కర్నూలులో 52 మంది మృతిచెందారు.

Advertisement

Next Story