టీకా తీసుకున్న 118 ఏళ్ల వృద్ధురాలు

by Shamantha N |
టీకా తీసుకున్న 118 ఏళ్ల వృద్ధురాలు
X

భోపాల్: కరోనా టీకాపై పంపిణీ మొదలైన తొలినాళ్లలో ఆశించిన స్పందన రాలేదు. చాలా మంది సంశయంతో వెనుకడుగువేశారు. కానీ, క్రమంగా ఈ పరిస్థితి మారుతూ వచ్చింది. తాజాగా, 118 ఏళ్ల బామ్మ ఈ టీకా తీసుకుని ఇతరులకూ పిలుపిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో తుల్సాబాయి ఆదివారం సాయంత్రం టీకా తీసుకున్నారు. అనంతరం ఇతరులూ టీకాను తీసుకోవాలని పిలుపిచ్చింది. అంతేకాదు, వ్యాక్సిన్ సేఫ్ అని కూడా తెలిపింది. ఆమె వయస్సును నిర్ధారించే దస్త్రాలను పున:పరిశీలించాలని సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ సింగ్ పురమాయించారు. ఆధార్ కార్డు ద్వారా ఆమె 1903లో జన్మించినట్టు అధికారులు కనుగొన్నారు.

Advertisement

Next Story