నిజామాబాద్‌లో 112 కరోనా నెగిటివ్ రిపోర్ట్స్

by Aamani |

దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కరోనా అనుమానితులుగా భావించిన 112మందికి నిర్వహించిన పరీక్షల్లో రిపోర్టు నెగెటివ్ వచ్చిందని కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని
శుక్రవారం ఆయన అధికారికంగా వెల్లడించారు. కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించగా రిజల్ట్స్ ఈ రోజు వచ్చాయన్నారు. అందులో ఒక్కరికి కూడా పాజిటివ్ రాకపోవడం ఆనందించదగ్గ విషయమన్నారు.ప్రస్తుతం వీరంతా ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంటున్నారని, నెగెటివ్ వచ్చిన వారిని ఇళ్లకు పంపించి హోమ్ క్వారంటైన్‌లో ఉండేలా అవసరమైన చర్యలు చేపడుతామని కలెక్టర్ వివరించారు.ఈ నెల 28వ తేదీ వరకు 112మంది హోమ్ క్వారంటైన్‌లో ఉంటారని తెలిపారు.

Tags: 112 carona negitive reports, nizamabad, collecter narayana reddy,lockdown

Advertisement

Next Story