- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
11మంది జూదరుల అరెస్టు..
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని గంగాస్థాన్ ఫేస్-1లోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. అయితే, విశ్వసనీయ సమాచారం మేరకు గత పదేండ్లుగా పేకాట స్థావరాలు నిర్వహిస్తూ.. తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తి ఇంటిపై టాస్క్‌ఫోర్సు పోలీసులు దాడి చేసి అతనితో సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..గంగాస్థాన్ ఫేస్-1లోని చైతన్య అనే వ్యక్తి జూదం నిర్వహిస్తుంటాడు. గతంలో కూడా చాలా సార్లు జూదం క్యాంపులు నిర్వహిస్తూ.. పోలీసులు దాడులు చేసే సమయంలో తప్పించుకుని పారిపోయేవాడు. చాలా రోజులుగా అతనిపై నిఘా పెట్టిన రూరల్ పోలీసులు శనివారం రాత్రి టాస్క్ ఫోర్సు సీఐ సంయుక్త అధ్వర్యంలో చైతన్య ఇంటిపై దాడులు చేశారు. ఆ సమయంలో కార్డ్స్ ఆడుతున్న 10మందితో పాటు నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రూ.2,69వేలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, చైతన్య జూదం నిర్వహణను వ్యాపకంగా చేసుకుని అడ్డాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అతనితో పాటు 10మంది పై కేసు నమోదు చేసి, రూరల్ ఎస్‌ఐ ప్రభాకర్‌కు అప్పగించినట్లు తెలిపారు.