మీకో గుడ్ న్యూస్.. దసరా నేపథ్యంలో SBI Credit card భారీ ఆఫర్

by Harish |   ( Updated:2021-09-29 09:00:33.0  )
మీకో గుడ్ న్యూస్.. దసరా నేపథ్యంలో SBI Credit card భారీ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ కార్డ్ తన క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కొసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటిచింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి ఈ ఆఫర్ కింద 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుందని సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘దమ్‌దార్ దస్’ పేరుతో ఈ ప్రత్యేక ఆఫర్ పరిమిత కాలానికి అక్టోబర్ 3వ తేదీ నుచి 5 వరకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.

అలాగే, ఈ ఆఫర్ ఈ-కామర్స్ సైట్లలో జరిపిన కొనుగోళ్లకు కూడా వర్తిస్తుందని, మొబైల్‌ఫోన్లు, ఫ్యాషన్, గృహోపకరణాలు, కిచెన్ అప్లయన్సెస్, లైఫ్‌స్టైల్, ఇంకా ఇతర అనేక వస్తువులకు కూడా ఆ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నామని ఎస్‌బీఐ కార్డ్ వివరించింది. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లకు ఈఎంఐ రూపంలో చేసే చెల్లింపులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. మూడు రోజులు మాత్రమే ఉండే ఈ పండుగ సీజన్ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలను ఇవ్వనున్నామని, వాటికి సంబంధించిన వివరాలను త్వరలో తెలపనున్నట్టు ఎస్‌బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రామమోహన్ రావు చెప్పారు. అయితే, బీమా, ప్రయాణం, వాలెట్, జ్యువెలరీ, ఆరోగ్య సంరక్షణ, యుటిలిటీ వంటి చెల్లింపులకు ఈ ఆఫర్ వర్తించదని సంస్థ వెల్లడించింది.

Advertisement

Next Story