- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమానంలో బంగారం.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన ఉద్యోగి
by Sumithra |
X
దిశ, శంషాబాద్ : అక్రమంగా బంగారం తరలిస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డాడు ఓ స్మగ్లర్. సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఎయిర్ క్యాటరింగ్ సర్వీస్‌లో పనిచేసే ఉద్యోగిపై అనుమానం వచ్చింది. కువైట్, ఖతర్, సౌదీ అరేబియా నుంచి వచ్చే విమానాల్లో బంగారాన్ని తీసుకువచ్చి స్మగ్లింగ్ చేస్తున్నట్టు అధికారులు సోదాలు చేసి గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 2 కిలోల బంగారు బిస్కెట్లతో పాటు, మరో 200 గ్రాముల విలువ చేసే 2 బంగారు రేకులను స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. విదేశాల్లో నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని సదరు ఉద్యోగి విమానాల్లోనే దాచాడని అధికారులు తెలిపారు. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో ఇంకెవరి హస్తం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Advertisement
Next Story