వారి త్యాగాలను భారత్ ఎన్నటికీ మరువదు: మోడీ

by Shamantha N |
వారి త్యాగాలను భారత్ ఎన్నటికీ మరువదు: మోడీ
X

పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల త్యాగాలను భారత్ ఎన్నటికీ మర్చిపోదని ప్రధాని మోడీ తెలిపారు. పుల్వామా దాడి జరిగి నేటికి ఏడాది కావడంతో ట్విట్టర్ వేదికగా పలువురు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మోడీ స్పందిస్తూ.. ‘పుల్వామా దాడిలో మృతి చెందిన అమరవీరులకు నివాళులు. దేశసేవలో భాగంగా ప్రాణత్యాగం చేసిన మీరు అసాధారణ వ్యక్తులు. మీ త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదు’ అని ట్వీట్ చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ..‘అమర వీరులకు నివాళులర్పించాను. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు, వారి కుటుంబాలకు యావత్ భారతం సర్వదా కృతజ్ఞతాభావంతో ఉంటుంది’ అని పేర్కొన్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందిస్తూ.. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మీకు దేశమొత్తం సెల్యూట్ చేస్తుందనీ, ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి దృఢ సంకల్పంతో ఉన్నామని వెల్లడించారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story