ఫైర్ కానిస్టేబుళ్ల సమస్యలను పరిష్కరించాలి

by  |

దిశ, న్యూస్ బ్యూరో :
రాష్ట్రంలో శిక్షణకు నోచుకోకుండా ఉన్న 165 మంది ఫైర్ కానిస్టేబుల్‌ళ్ల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌కు శుక్రవారం లేఖ రాశారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం 18 వేల పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని, వీరిలో 165 మంది ఫైర్ కానిస్టేబుల్స్‌గా నియామకం అయ్యారని లేఖలో వివరించారు. కానీ, ఇప్పటివరకు వీరికి శిక్షణ ఇవ్వటం లేదని, దీంతో నియామక పత్రం పొంది కూడా శిక్షణ ఇవ్వకపోవడంతో వారు మనోవేదనకు గురవుతున్నారన్నారు. మిగతా కానిస్టేబుళ్లకు ఇస్తున్నట్టుగానే ఫైర్ కానిస్టేబుల్‌ళ్లకు శిక్షణ ప్రారంభించాలని లేఖలో పేర్కొన్నారు. ఎంపిక అయిన వారికి మార్చి 29న శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో వాయిదా వేశారన్నారు. సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, కమ్యూనికేషన్స్, జైల్ వార్డెన్స్ కానిస్టేబుల్స్ కు కరోనా సమయంలో కూడా శిక్షణ ఇస్తున్నారని, కానీ ఫైర్ కానిస్టేబుల్స్‌కు శిక్షణ ఎందుకు ఇవ్వడం లేదని ఎంపీ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక పరమైన ఇబ్బందితో పూట గడవక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారని, వారికి వెంటనే శిక్షణ ప్రారంభించాలని లేఖలో కోరారు.

fire constable problem, solving, hyd, telangana, mp komatireddy letter, to cm kcr

Advertisement

Next Story

Most Viewed