అడ్డగోలు దోపిడీ.. 9 రోజుల కరోనా చికిత్సకు రూ. 20 లక్షలు..!

by Shyam |   ( Updated:2021-05-27 06:50:11.0  )
corporate hospitals
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సోకి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న బాధితులకు యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నారు. లక్షల్లో బిల్లులు వేస్తూ, బిల్లు కట్టకుంటే మృతదేహాలను ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. తాజాగా గురువారం హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెలుగుచూసింది. కరోనా సోకి, శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఓ వ్యక్తి మే 9న బంజరాహిల్స్‌ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. 9 రోజుల చికిత్స అనంతరం పేషెంట్ మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు.

కాగా, ఈ 9 రోజుల చికిత్సలో భాగంగా రూ. 20 లక్షలు బిల్లు వేసిన ఆస్పత్రి సిబ్బంది.. బిల్లు చెల్లించిన తర్వాతే శవాన్ని తీసుకెళ్లాలని చెప్పారు. మృతుడి చెల్లెలు కూడా డాక్టర్ కావడంతో బిల్లును పరిశీలించగా ఇంత ఎలా అయిందని గొడవకు దిగింది. ఆమెకు తోడు బంధువులు కూడా ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే రూపాయి చెల్లించకుండానే సదరు హాస్పిటల్‌ మృతదేహాన్ని అప్పగించారు. అయినప్పటికీ అమాయకులైన జనాల వద్ద కరోనా చికిత్స, మృతదేహాలను అడ్డుపెట్టుకొని వ్యాపారం చేయడం ఏంటని బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఇదే సమయంలో పోలీసులు రావడంతో ఆ ఆస్పత్రిలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన అన్న చనిపోయాడమని మృతుడి చెల్లెలు ఆరోపించడం గమనార్హం.

Hyderabad private hospitals charging lakhs for Covid-19 treatment

Advertisement

Next Story

Most Viewed