- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. సిగ్గుందా అంటూ
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల జరగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రేయింబవళ్లు శ్రమించి పండించిన పంట వర్షాలకు తడిచి పాడవుతుండటంతో రైతన్న గుండెలు ఆగిపోతున్నాయి. యాసంగిలో పండే ధాన్యం కొంటారా? కొనరా? అని కేంద్రాన్ని టీఆర్ఎస్ సర్కార్ ప్రశ్నిస్తుండగా.. ఖరీఫ్ పంట కొనుగోళ్లను చేయండని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. రోజుకో రైతు చనిపోతున్న క్రమంలో వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రైతులను కోటీశ్వరులను చేశామని చెప్పేందుకు సీఎం కేసీఆర్‌కు సిగ్గుండాలని విమర్శించారు. వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని ఎప్పుడు కొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతుంటే, యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మీ డ్రామాలకు ఇప్పటికే 10 మంది రైతుల గుండెలు ఆగిపోయాయని.. తాజాగా మరో ఇద్దరు చనిపోయారన్నారు. రాష్ట్రంలో ఇంకెంత మంది రైతులు చస్తే మీ కళ్లు చల్లబడుతాయి కేసీఆర్ అని ప్రశ్నించారు. ఒక్కసారి ఫామ్ హౌస్ మత్తు నుంచి బయటికి వచ్చి చూడండి.. ప్రభుత్వం చేసిన పనికి రైతులు కోటీశ్వరులు కాలేదని.. ఉరి కొయ్యకు ఉరి వేసుకుంటున్నారని తెలుస్తుందన్నారు. మీరు పంట కొనక కాటికి పంపుతున్నారని అర్ధమవుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.