- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో మేయర్ అభ్యర్థులు వీరేనా..?
దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: ఏపీ మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ రికార్డు సృష్టించింది. సంచలన విజయం సాధించింది. అన్ని కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. 12 కార్పొరేషన్లకు గాను 11 కార్పొరేషన్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఏలూరు కార్పొరేషన్ ఎన్నిక జరిగినప్పటికీ హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి. అయితే తాజాగా 11 కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను వైసీపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒంగోలు మేయర్ అభ్యర్థిగా సుజాతను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గుంటూరు కార్పొరేషన్ కి సంబంధించి కావటి మనోహర్ నాయుడు లేదా పాదర్తి రమేశ్ గాంధీలలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. లేని పక్షంలో బీసీ మహిళలకు 50శాతం కోటాలో చంద్రగిరి కరుణ కుమారిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ కి వంశీకృష్ణ శ్రీనువాసు, శ్రీధర్, ఉషశ్రీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కర్నూలు కార్పొరేషన్ కి బి.వై రామయ్యకి ఖరారైనట్లు తెలుస్తోంది. కడప కార్పొరేషన్ కి.. కె.సురేష్ బాబు, తిరుపతి కార్పొరేషన్ కి డా.శిరీష లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ కార్పొరేషన్ కి భాగ్య లక్ష్మి, విజయనగరం కార్పొరేషన్ కి ఎడ్ల కృష్ణవేణి పేర్లను పరిశీలిస్తున్నారు. అలాగే మచిలీపట్నం, చిత్తూరు మేయర్ అభ్యర్థులను ఎంపిక చేసే అంశంపై సీఎం జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సాయంత్రానికి అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది.