- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ తిరుపతి అభ్యర్థి ఎవరో తెలుసా?
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఫిజియోతెరపిస్టు మద్దిల గురుమూర్తిని శుక్రవారం ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సీఎం జగన్ ప్రజా సంకల్పయాత్రలో ఆయనకు ఫిజియోతెరపిస్టుగా గురుమూర్తి సేవలందించారు. అంతేకాదు. జగన్‌సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్రలోనూ గురుమూర్తి ఫిజియోతెరపిస్టుగా సేవ చేశారు. ప్రస్తుతం విజయవాడలోని శిశు సంక్షేమ శాఖలో సలహాదారుగా పనిచేస్తున్నారు.
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నసముద్రం ఆయన సొంతూరు. తిరుపతి స్విమ్స్‌లో బ్యాచిలర్ఆఫ్ఫిజియోతెరపీ చేశారు. 2008 నుంచి 2015 వరకు తిరుపతిలోని శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఫిజియోతెరపిస్టుగా పనిచేశారు. 2015 నుంచి 2019 వరకు తిరుపతిలోని ఆసరా రిహాబిలిటేషన్ కేంద్రానికి ఎండీగా వ్యవహరించారు. తొలుత బల్లి దుర్గా ప్రసాదు భార్య లేదా కుమారుడు కల్యాణ చక్రవర్తికి సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో సానుభూతి ఓట్లు పొందడం కష్టమని భావించిన పార్టీ అధిష్టానం సీఎం జగన్సూచన మేరకు గురుమూర్తిని ఎంపిక చేసింది. దుర్గా ప్రసాదు కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీనిచ్చింది.