కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

by srinivas |
roja kabaddi
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా కబడ్డీ ప్లేయర్ అవతారం ఎత్తారు. నిత్యం రాజకీయ వ్యవహారలతో బిజీబిజీగా ఉండే రోజా కాసేపు సరదాగా కబడ్డీ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. నియోజకవర్గంలోని నిండ్ర మండలం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో డా.బి.ఆర్ అంబేడ్కర్ సెలెక్ట్ 7వ మెగా టోర్నమెంట్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ ఆడారు. కబడ్డీ గ్రౌండ్ లో ఎమ్మెల్యే రోజా దూకుడుగా ఆడారు. రాజకీయాల్లో ఇతర పార్టీల నేతలపై విరుచుకుపడే రోజా ఆటలోనూ తన ప్రతిభను చూపారు. ఈ సదర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె తనకు స్కూల్ డేస్ లో కబడ్డీ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆటగాళ్లతో కలిసి కబడ్డీ ఆడటం వల్ల తన స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయని ఎమ్మెల్యే రోజా తెలిపారు.

Advertisement

Next Story