వైఎస్ షర్మిలకు పోలీసుల ఝలక్..

by Shyam |   ( Updated:2021-06-11 01:06:58.0  )
sharmila convoye stop
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కళ్లాల్లోనే ధాన్యం తడిసి ముద్దవుతోంది. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాక కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో రైతులు తెచ్చిన ధాన్యం మార్కెట్ యార్డుల్లో తడిసి మొలకలు వస్తున్నాయి.

ఇక ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ షర్మిల రంగారెడ్డి జిల్లాలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆమెకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. రైతుల కష్టాలను ప్రభుత్వానికి వివరించేందుకు చేవెళ్లలో శుక్రవారం పర్యటనను ప్రారంభించగా చింతపల్లి దగ్గర షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో షర్మిల పరిగిలో పర్యటిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, తమ వాహనాలను ఎందుకు ఆపారని షర్మిల ప్రశ్నించగా, కొవిడ్ సమయంలో భారీ బందోబస్తుతో వెళ్లకూడదని, కొద్ది మందితో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఆ తర్వాత కొద్ది మందితో వైఎస్ షర్మిల తన పర్యటనను ముందుకు కొనసాగించారు.

Advertisement

Next Story

Most Viewed