- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెతుకు సీమకు పాలకులు చేసిందేంటి? – వైఎస్ షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం జిల్లాగా చెప్పుకునే మెదక్ జిల్లా మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు ఇప్పటీకైనా పరిహారం అందిందా ? అని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందరికీ అన్నం పెట్టే మెతుకు సీమ మెదక్ జిల్లా అని, అలాంటి జిల్లాకు ప్రస్తుత పాలకులు ఏం చేశారని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. లోటస్ పాండ్ లో బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా అభిమానులు, నాయకులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా షర్మిల మాట్లాడుతూ .. వైఎస్ఆర్ తలపెట్టిన ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు తెలంగాణకే తలమానికంగా నిలిచాయని, తెలంగాణ మొత్తంగా 16.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టని తెలిపారు. కేవలం మెదక్ జిల్లాకే 5.19 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందించి మెదక్ అభివృద్ధికి వైఎస్సార్ ఎంతో కృషి చేసారని, కానీ ప్రస్తుత పాలకులు రీడిజైన్ పేరుతో ప్రజలకు తీవ్ర నష్టం చేశారని ప్రభుత్వాన్ని విమర్శించారు. సింగూర్ ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా వైఎస్ఆర్ తలపెట్టిందేనని షర్మిల స్పష్టం చేశారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు నేటికీ పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా రైతులకు పరిహారం ఇస్తూ ప్రజలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్ చెరు ప్రాంతం వద్ద ఏర్పడుతున్న కాలుష్యాన్ని నియంత్రించేదుకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని షర్మిల ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని ఇటీవలే ఒక నిరుద్యోగి ఆత్మహత్య కు పాల్పడ్డాడని, రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం దురదృష్టకరమని అన్నారు.