‘షర్మిల పార్టీకి నిర్మాత వైఎస్ జగన్ అయితే డైరెక్టర్ కేసీఆర్’

by srinivas |
‘షర్మిల పార్టీకి నిర్మాత వైఎస్ జగన్ అయితే డైరెక్టర్ కేసీఆర్’
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ షర్మిల ప్రారంభించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీకి నిర్మాత వైఎస్ జగన్ అయితే దర్శకుడు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్న నారాయణ శనివారం మీడియాతో మాట్లాడారు. సూది విజయవాడలో పోతే షర్మిల హైదరాబాదులో వెతుకుతోందంటూ సెటైర్లు వేశారు. జగన్, కేసీఆర్ అనుమతి లేకుండా తెలంగాణలో షర్మిల తిరగగలరా? అని ప్రశ్నించారు.

ఇకపోతే వైసీపీలో జగన్, ఎంపీ రఘురామలు ఇద్దరూ కలిసే గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. అమిత్ షా దయాదాక్షిణ్యాలు ఉన్నంత వరకు జగన్ బెయిల్ రద్దు కాదన్నారు. వెంకయ్యనాయుడు ఒక మాట చెబితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడలేకపోతే వెంకయ్య ఉత్సవ విగ్రహమేనని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ వ్యవస్థలను డమ్మీగా మార్చేశారని విమర్శించారు. కేంద్రానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన జడ్జికి రాజ్యసభ సీటు ఇచ్చారంటూ ధ్వజమెత్తారు. బీజేపీ వ్యతిరేక వేదిక కోసం అందరూ కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు.

Advertisement

Next Story