- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
100 భాషల్లో.. యూట్యూబ్ కామెంట్స్ అనువాదం
దిశ, ఫీచర్స్ :యూట్యూబ్ వీడియోలు వరల్డ్‌వైడ్‌గా వైరల్ అవుతూ ఉంటాయి. అవి నచ్చిన లేదా నచ్చని వ్యక్తులు తమ తమ మాతృభాషలో కామెంట్ చేస్తుంటారు. అవి ఇతర భాషాపరులకు అర్థం కావు. అందుకే యూట్యూబ్ ఆయా కామెంట్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి రాగా, 100 భాషలను దీని ద్వారా అనువాదం చేయొచ్చు. దీంతో ఇతర భాషల్లోని వ్యాఖ్యలను చదవడానికి ఇది వినియోగదారులను అనుమతిస్తుంది.
యూట్యూబ్ మొబైల్ వినియోగదారుల కోసం కొత్త ట్రాన్స్‌లేట్ బటన్‌ని విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది. దీన్ని ఆండ్రాయిడ్, ఐవోఎస్ కస్టమర్స్ వినియోగించుకోవచ్చు. ‘ట్రాన్స్‌లేట్ బటన్’ను కామెంట్స్ దిగువన చూడవచ్చు. ఉదాహరణకు, మీ మాతృభాష ‘తెలుగు’గా సెట్ చేస్తే.. వీడియో కింద పోస్ట్ చేసిన వ్యాఖ్యలు వేరే భాషల్లో ఉంటే.. ‘ట్రాన్స్‌లేట్ టు తెలుగు’ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఈ బటన్ లైక్, డిజ్ లైక్, రిప్లయ్ ఆప్సన్స్ పైన ఉంటుంది. స్పానిష్, పోర్చుగీస్, డ్యూచ్, ఫ్రెంచ్, బాహాసా, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా 100 కి పైగా భాషలలో అనువాదానికి మద్దతు ఇస్తుంది. వ్యాఖ్యలను అనువదించాలనుకున్న ప్రతీసారి ట్రాన్స్‌లేట్ బటన్‌పై క్లిక్ చేయాల్సిందే.
Now on mobile: A 'Translate' button for YouTube comments in over 100 languages 💬🌎
Unlock conversations with communities around the world in just one click!
Try it out in español, português, Deutsch, Français, Pусский, 日本語, Bahasa & 100+ more
Info→ https://t.co/Fj0AY3GaTs pic.twitter.com/uqWATsvht5
— TeamYouTube (@TeamYouTube) September 13, 2021