TG Govt: ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందన

by Gantepaka Srikanth |
TG Govt: ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) వివాదంపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతిపై పునరాలోచన చేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. వెంటనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. కాగా, ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గతకొన్ని రోజులుగా నిర్మల్ జిల్లా దిలావర్​పూర్(Dilawarpur) గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. గ్రామంలోని చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంతా కలిసి రోడ్లమీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. పరిశ్రమ ఏర్పాటును రద్దు చేసేంతవరకు తమ పోరాటం ఆగదని దిలావర్​పూర్​ ప్రజలు స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ పంట పొలాలతో పాటు పర్యావరణం సైతం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటును ఎట్టి పరిస్థితిలో అడ్డుకుంటామని తేల్చి చెబుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed