ACB Investigation: ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్‌ఎన్ రెడ్డి

by Shiva |   ( Updated:10 Jan 2025 5:02 AM  )
ACB Investigation: ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్‌ఎన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసులో ఇవాళ ఉదయం హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్‌ఎన్ రెడ్డి (BLN Reddy) ఏసీబీ (ACB) విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు విచారణలో భాగంగా హెచ్ఎండీఏ (HMDA) నుంచి నిధులను ఎఫ్ఈవో (FEO) కంపెనీకి బదిలీ చేయడంపై ఆయనను అధికారులు ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇదే కేసులో హెచ్ఎండీఏ (9HMDA) ఖాతా నుంచి బ్రిటన్‌ (Britain)కు భారీ ఎత్తున నిధులు బదిలీ అయినట్లుగా ఈడీ (ED) కూడా గుర్తించింది.

అయితే, హెచ్ఎండీఏ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన రూ.45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీ శాఖ (Income Tax Department)కు చెల్లించిన రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.54 కోట్ల లావాదేవీలకు సంబంధించి వివరాలను రాబట్టి ఏసీబీ అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) అనుమతుల వ్యహారాలు, ఎవరి ఆదేశాలతో నిధుల కోసం ఫైల్ మూవ్ చేశారు, అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందకు వ్యవహరించాల్సిం వచ్చిందనే అంశాలపై ఏసీబీ అధికారులు బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్‌ (Aravind Kumar)లను ఏసీబీ అధికారులు విచారించారు.

Next Story

Most Viewed