బీరు తెల్లగా అయ్యిందటా.. ఒక్క సిప్‌తో వాంతులే వాంతులు..!

by Sumithra |
బీరు తెల్లగా అయ్యిందటా.. ఒక్క సిప్‌తో వాంతులే వాంతులు..!
X

దిశ, పరిగి : బీరు తాగి ఓ యువకుడు వాంతులు చేసుకున్నాడు. పరిగి పట్టణానికి చెందిన నవీన్ అనే యువకుడు తిరుమల వైన్స్‌లో ఆదివారం సాయంత్రం కింగ్ ఫిషర్ లైట్ 8 బీర్లు తీసుకున్నాడు. యువకులంతా పార్టీ చేసుకునేందుకు బీరు ఓపెన్ చేసి ఓ సిప్ తాగగానే వాంతులయ్యాయి.

ఇదేంటని చూడగా కల్లు మాదిరి తెల్లగా ఉండటంతో వైన్స్ దుకాణం వద్దకు వచ్చి విషయం వెల్లడించాడు నవీన్. వారు పట్టించుకోకపోవడంతో పరిగి ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్‌కు మద్యం కొనుగోలు చేసిన యువకులు ఫోన్ చేశారు. అయితే, ఆ బీరు తిరిగి ఇచ్చి మరో బీరు తీసుకువెళ్లండని ఆ అధికారి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement

Next Story