- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కురుల స్టైల్ అదిరె ఫ్యాషన్ గురూ..
దిశ, శేరిలింగంపల్లి: నేడంతా ఫ్యాషన్. ట్రెండ్.. అంటూ దూసుకెళ్తున్నారు. టాప్ టు బాటమ్.. సరికొత్త లుక్ కోసం పోటీ పడుతున్నారు. ఇందుకోసం రోజుకో ట్రెండ్ క్రియేట్ చేస్తూ.. యూత్ ఫాలో అవుతున్నారు. స్మార్ట్ యుగంలో ఏ మూలన కొత్తదనం కనిపించినా.. ఇట్టే ప్రపంచాన్ని చుట్టేస్తున్నది. ఇప్పుడు హెయిర్ స్టైల్ ఎప్పటికప్పుడు సరికొత్తగా వైరల్ అవుతున్నది. కట్టింగ్, డిజైన్ లో చిన్నచిన్న మార్పులు చేస్తూ బాయ్స్ అండ్ గర్ల్స్ లుక్స్ తమవైపు తిప్పుకుంటున్నారు. ఒకరు చిన్నగా జుట్టు కట్ చేసుకుంటే, మరొకరు పొడుగ్గా పెంచేస్తున్నారు. ఇంకొందరు చుట్టూ హెయిర్ కట్ చేసి పైన మాత్రం వదిలేస్తున్నారు. మరికొందరు రకరకాలుగా హెయిర్ కట్ చేయించుకుని కనిపిస్తున్నారు. వీటికి రకరకాల పేర్లు పెట్టేసి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో ఆడమగ అనేతేడా లేకుండా.. అందరూ కేశాలంకరణకు ప్రయార్టీ ఇస్తున్నారు.
స్టైలిష్ లుక్స్..
ట్రెండీగా.. స్టైలిష్ లుక్ కోసం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తుంటారు యూత్. ఇది కేవలం అమ్మాయిలకు మాత్రమే పరిమితం కాలేదు. అబ్బాయిలు సైతం జట్టుపై రకరకాల ప్రయోగాలు చేసేస్తున్నారు. ఎవరికి నచ్చిన స్టైల్ లో వాళ్లు తమ జుట్టును అందంగా మల్చుకుంటున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా రెడీ అవుతున్నారు. అమ్మాయిలు అంటేనే హెయిర్ స్టైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్స్, అమ్మాయిలకు జుట్టే అందం అంటుంటారు. కానీ ఇప్పుడు మగవారికీ జుట్టే అందం అంటున్నారు యూత్. అందుకు తగ్గట్టుగా రకరకాలుగా హెయిర్ స్టైల్స్ మెంటేన్ చేస్తున్నారు. గతంలో అబ్బాస్ హెయిర్ స్టైల్, వినీత్ కటింగ్ అని యూత్ మొత్తం వారి స్టైల్ ఫాలో అయింది. ఆ తర్వాత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ స్టైల్ అంటూ కుర్రకారు పెద్ద జుట్టు పెంచేసింది. అలాగే స్టార్ ఫుట్ బాలర్స్ బెక్ హామ్, రోనాల్డో, బాలీవుడ్, టాలీవుడ్ హీరోస్ స్టైల్స్ ను ఫాలో అయ్యారు. ఇప్పుడు అదే తరహాలో టీ మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ కటింగ్స్‌ను ఫాలో అవుతున్నారు.
టాప్ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ఇవే..
లాంగ్ వన్ సైడ్ హెయిర్ స్టైల్: దీన్నే అండర్ హెయిర్ కట్ అని కూడా పిలుస్తారు. గుండ్రటి, కోల ముఖాలకు కూడా ఈ స్టైల్ బాగుంటుంది అంటున్నారు హెయిర్ స్టైలిష్ లు. దీనికోసం అబ్బాయిలు హెయిర్ బాగా పెంచాలి. అప్పుడే అందంగా కనిపిస్తుందని చెబుతున్నారు.
పంకీ హెయిర్ స్టైల్
స్పైస్ హెయిర్ కట్ అని కూడా పిలుస్తారు. ఈ పంకీ హెయిర్ స్టైల్ అన్నిరకాల జుట్టువాళ్లకు సెట్ అవుతుంది. పిల్లలు ఎక్కువగా ఈ హెయిర్ స్టైల్ నే ఫాలో అవుతున్నారు. హెయిర్ ని బాగా షార్ట్ చేయడమే ఈ పంకీ స్టైల్ స్పెషల్.
లాంగ్ బ్రౌన్ కేర్ లెస్
హైలెట్స్ చేయడమే ఈ కట్ ప్రత్యేకం.
లెంగ్తీగా పెంచి జుట్టును వదిలేస్తారు. ఆ తర్వాత బ్రౌన్ కలర్‌తో హైలెట్స్ చేస్తారు. ఏ ఫేస్ కైనా ఈ హెయిర్ కట్ సెట్ అవుతుంది.
లెంగ్త్ అండర్ కట్
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హెయిర్ కట ల్లో ఇదీ ఒకటి. చుట్టూ జుట్టు కట్ చేసి మధ్యలో వదిలేయడమే ఈ కట్ స్పెషల్. ఇప్పుడు దీనికి భలే క్రేజ్ ఉంది.
హెయిర్ కట్స్‌పై అమ్మాయిల మోజు..
ఇది వరకు హెయిర్ కటింగ్ అంటే కేవలం అబ్బాయిలకు మాత్రమే అనేలా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అబ్బాయిలే కాదు అమ్మాయిలూ సెలూన్స్ కు వెళ్లి హెయిర్ కట్, స్ట్రేటెనింగ్, రింగ్స్ హెయిర్ అంటూ చాలారకాలుగా తమ జుట్టుపై ప్రయోగాలు చేస్తున్నారు. అలాగే తమకు ఇష్టమైన విధంగా కలర్స్ వేసుకుని నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. దీంతో ఇప్పుడు అమ్మాయిల కోసం కూడా కుప్పలు తెప్పలుగా సెలూన్స్ వెలుస్తున్నాయి. కొన్నిచోట్ల అబ్బాయిలు, అమ్మాయిలకు ఒకేచోట హెయిర్ కట్ సెలూన్స్ నిర్వహిస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మాత్రమే కాదు, రెగ్యులర్ గా కూడా అమ్మాయిలు హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతున్నారు. అమ్మాయిల హెయిర్ కట్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయంటున్నారు హెయిర్ స్టైలిస్ట్ లక్ష్మి. అయితే ఎక్కువ మంది స్ర్టేయిటనర్, లెంగ్తీ హెయిర్ కట్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు మరో హెయిర్ స్టైలిస్ట్ లావణ్య.
కలర్ ఫుల్ జుట్టు..
జుట్టు నెరిసినప్పుడు మాత్రమే కాదు హెయిర్ స్టైల్ ని బట్టి కూడా ఇప్పుడు చాలామంది జుట్టుకు కలర్స్ వేస్తున్నారు. బ్రౌన్, గోల్డెన్, మెరూన్, పర్పుల్, హనీ బ్రౌన్, చెర్రీ వంటి కలర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే నచ్చిన కలర్‌ని జుట్టుకు వేసుకోకుండా ఎక్స్ పర్ట్స్ సాయంతో కలర్ వేసుకోవడం మంచిదంటున్నారు హెయిర్ స్టైలిస్ట్ లు. జుట్టు, ముఖాన్ని బట్టి రంగు సెలక్ట్ చేసుకోవాలి. జుట్టుకు రంగేసుకున్న తర్వాత హార్డ్ షాంపు, డాండ్రఫ్ షాంపులు వాడకూడదు. ముఖ్యంగా కెమికల్స్, సల్ఫేట్ లేని షాంపులు ఎంచుకోవాలంటున్నారు. షాంపు చేసుకున్న ప్రతి సారీ తప్పనిసరిగా కండిషనర్ వాడాలి. అందులోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కండిషనర్లను వాడాలి. కలరింగ్ తర్వాత జుట్టును ఆరబెట్టాలంటే బ్లో డ్రైలు వాడకుండా ఉండటం మంచిదని సలహా ఇస్తున్నారు. రంగు వేసుకున్న తర్వాత హెయిర్ ప్యాక్ వేసుకోవాలనుకుంటే ఎక్స్ పర్ట్ సాయంతో జుట్టుకు హానిచేయని ప్యాక్ లు వేసుకోవాలి. వారానికి ఒకసారి హెయిర్ స్పా ట్రీట్ మెంట్ తీసుకుంటే కలర్ ఎక్కువ కాలం ఉంటుందట.
హెయిర్ కట్ తర్వాత
హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత జుట్టును మరింత జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు సెలూన్స్ ఎక్స్ పర్ట్స్. హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత హెయిర్ స్టైలింగ్ కి చేతి వేళ్లను ఉపయోగించకూడదు. మెత్తటి బ్రష్ ను మాత్రమే వాడాలి. హెయిర్ స్టైలింగ్ తర్వాత హెయిర్ పొజిషన్ మారుతుంది. కొద్దిగా వంగినట్లు, ముడుచుకున్నట్లు కనిపిస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడాలంటే కండిషనర్ వాడాలి. హెయిర్ కట్ షేప్ మారకుండా ఉండాలన్నా.. చిక్కుపడకూడదన్నా కండిషనర్ తప్పనిసరి అని సూచిస్తున్నారు. సిరమ్ ఉపయోగించడం వల్ల జుట్టు స్మూత్, సిల్కీగా ఉంటుంది. హెయిర్ వాష్ తర్వాత కూడా జుట్టు పట్టులా మెరుస్తుంది.
డిమాండ్ పెరిగింది : లావణ్య, హెయిర్ స్టైలిస్ట్
ఈమధ్యకాలంలో బ్యూటీ సెలూన్లలో కేవలం ఫేస్ బ్యూటీ కోసం మాత్రమే కాకుండా సెలూన్స్ కు కూడా బాగా డిమాండ్ పెరిగింది. హెయిర్ కట్ కోసం, స్ట్రేటెనింగ్ తదితర వాటికోసం అమ్మాయిలు సెలూన్స్ కు వస్తున్నారు. మేము కూడా వారి టేస్ట్ కు తగ్గట్టుగా హెయిర్ కట్స్ చేస్తున్నాం అలాగే హామ్ సర్వీస్ కూడా ఇస్తున్నాం.
ట్రెండ్ ఫాలో అవుతున్నారు : లక్ష్మి, హెయిర్ స్టైలిస్ట్
ఇది వరకంటే ఇప్పుడు అమ్మాయిలు జట్టు మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. హెయిర్ పెంచేస్తేనే కాదు చిన్నగా ఉన్నా అందంగా ఉంచుకుంటున్నారు. ఇందుకోసం సెలూన్స్ కు వస్తున్నారు. వారి ఫేస్, హైట్, టేస్ట్ కు తగ్గట్టుగా జుట్టు కటింగ్ చేస్తుంటాం. అలాగే ట్రెండ్ కూడా ఫాలో అవుతూ అందంగా ఉండేలా హెయిర్ స్టైలిష్ చేస్తుంటాం.