- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నవ వధువు సిగ్గుకు బలైన ఆరోగ్యశాఖ అధికారులు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా లక్షణాలు కొంచెం కనిపించినా టెస్ట్ చేయించుకొని ఐసోలేషన్ కి వెళ్లడం ముఖ్యమని అధికారులు చాలా కఠినంగా చెప్తున్నారు. ఇక పెళ్లి వేడుకలు, వేరే గ్రామాలకు వెళ్ళేటప్పుడు కరోనా టెస్ట్ కంపల్సరీ. అయితే కరోనా టెస్ట్ చేయించుకోవడానికి కొంతమంది భయపడతారు. అయినా వైద్యులు ధైర్యం చెప్పి పరీక్షలు చేస్తారు. తాజాగా ఓ అమ్మాయికి కరోనా పరీక్షలు చేయబోయి అక్కడున్నవారి చేత అధికారులు దెబ్బలుతిన్న ఘటన ఉత్తరప్రదేశ్ అలీఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే షాహ్ నగర్ సారౌలా గ్రామంలో కరోనా టెస్టులు చేయడానికి ఆరోగ్యశాఖ అధికారులు వచ్చారు. ఆ గ్రామంలో ఎవరైతే టెస్టులు చేయించుకోవాలనుకున్నారో అందర్నీ లైన్ లో నిలబడమన్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే కరోనా టెస్ట్ కి ఓ నవ వధువు వచ్చింది. ముఖాన్ని తన చీరతో కప్పుకొని వచ్చిన ఆమెకు అధికారులు పరీక్ష చేయాలంటే ముఖం మీద ఉన్న చీర తీయవల్సిందిగా కోరారు. నవ వధువు సిగ్గుపడుతూ, చుట్టూ చాలామంది మగవారు ఉన్నారని, తానూ ముసుగు తీయలేనని తెలిపింది. దీంతో అధికారులు అక్కడున్న మగవారిని ఆమెకు కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరారు. దీంతో రెచ్చిపోయిన మగవారు మమ్మల్నే పక్కకి వెళ్ళమంటావా..? అంటూ అధికారులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.