- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కోహ్లి రికార్డులను బ్రేక్ చేసేది బాబర్: యూనిస్‌ఖాన్
దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి ప్రస్తుతం తన కెరీర్‌లో ఉచ్ఛ దశలో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో టీమ్ఇండియాను విజయవంతంగా నడిపిస్తూనే సొంత రికార్డులు కూడా సృష్టిస్తున్నారు. రాబోయే కాలంలో సచిన్ 100శతకాల రికార్డును కూడా అందుకుంటాడని పలువురు క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కోహ్లికి పోటీ ఎవరనే ప్రశ్న మొదలైంది. కోహ్లికి గట్టి పోటీ ఇచ్చేది స్టీవ్ స్మిత్ అని అందరూ అంటున్నారు. అయితే, కోహ్లి రికార్డును ఛేదించేది పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ అని ఆ దేశ మాజీ ఆటగాడు యూనీస్ ఖాన్ అంటున్నాడు. అండర్-19, జాతీయ జట్లకు సారథ్యం వహించడం వల్ల కోహ్లి, బాబార్‌కు మధ్య పోలికలు తెస్తున్నారు. కానీ, యూనిస్ ఖాన్ మాత్రం వీరిద్దరికీ పోలిక పెట్టడం సరైనది కాదన్నాడు. కానీ, ఐదేండ్ల తర్వాత మాత్రం కోహ్లి రికార్డులను బాబర్ తప్పక బద్దలు కొడతాడు. ఇప్పుడు కోహ్లి ఏ స్థితిలో ఉన్నాడో అప్పుడు బాబర్ కూడా అలాగే ఉంటాడని చెప్పాడు. ఈ పోలికలపై బాబర్ స్పందించాడు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే తాను వెనుకబడే ఉన్నానని అన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ ఒకరు. అతడిని చేరుకోవాలంటే ఎంతో సాధించాల్సి ఉందన్నాడు. ఇప్పటికీ తాను అతని వెనకే ఉన్నానని బాబర్ చెప్పాడు. టాప్ బ్యాట్స్‌మాన్‌తో పోటీ పడటానికి పరుగులు చేయను, కేవలం వ్యక్తిగత సంతృప్తి కోసమే ఆడతానని బాబర్ చెప్పుకొచ్చాడు.