- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛీఛీ… వీళ్లసలు అన్నలా..? కామాంధులా..?
దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకు సమాజం లో ఆడపిల్లకు భద్రత లేకుండా పోతుంది. బయటికి వెళ్తే కామాంధుల చూసే చూపులు, ఆఫీస్ కి వెళ్తే నీచంగా మాట్లాడే సహ ఉద్యోగులు, ఎక్కడ చూసినా వీరే. వారికి ధైర్యం చెప్పి, మేము ఉన్నామని తోడుగా నిలవాల్సిన తోబుట్టువులు సైతం కామాంధులుగా మారారు. సొంత చెల్లి అనే విచక్షణ కూడా లేకుండా లైంగిక వేధింపులకు గురిచేసారు. ఆ బాధలను తల్లికి, పెద్దమ్మకు చెప్పుకున్నా ఆ యువతి బాధలు తీరలేదు. కొడుకులను సమర్థిస్తూ ఆ మహిళలు మరో ఆడపిల్ల గొంతు కోయడానికి ప్రయత్నించారు. అన్నల కీచక వేధింపులు తట్టుకోలేని ఆ యువతి పోలీసుల చెంతకు చేరింది. ఈ అమానుష ఘటన తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెంలో వెలుగు చూసింది.
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఒక యువతి చిన్నతనంలోనే తండ్రి ఇల్లు వదిలివెళ్లిపోవడంతో తల్లి, అన్నయ్య లతో కలిసి ఉంటుంది. అయితే ఆమె 9 వ తరగతి చదువుతున్నప్పటినుండే సొంత అన్న చేతిలో లైంగిక వేధింపులకు గురైంది. పెరుగుతున్న కొద్దీ ఆ కామాంధుడి ఆగడాలు ఎక్కువయ్యాయి కానీ తగ్గలేదు. ఈలోపు యువతి ఇంటర్ పూర్తి కావడంతో పై చదువులకని పెద్దమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటానని చెప్పి అన్న ఆగడాల నుండి తప్పించుకుంది. హమ్మయ్యా.. అనుకొనేలోపు పెద్దమ్మ కొడుకు కన్ను ఆమెమీద పడింది. అతడు కూడా యువతిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఇన్నాళ్లు మౌనంగానే భరించిన యువతి వారి ఆగడాలను తట్టుకోలేకపోయింది. తల్లి, పెద్దమ్మకు విషయం చెప్పింది. వారు కొడుకులను సమర్దిస్తుండడంతో దిక్కు తోచని పరిస్థితిలో పోలీసులను ఆశ్రయించింది.
చిన్నతనం నుండి సొంత అన్నలు పెట్టిన చిత్ర హింసల గురుంచి ఏకరువు పెట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతి అన్నను అరెస్ట్ చేశారు. ఈ విషయం బయటకి రావడంతో అవమానం తట్టుకోలేక పెద్దమ్మ కొడుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.