- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊహించని షాక్.. ఈడీ నోటీసులు జారీ?

X
దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ ఎంపీ(YCP MP) విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)కి ఊహించని షాక్ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్(కేఎస్‌పీఎల్), కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఈడీ(Enforcement Directorate) ఉచ్చు బిగిస్తోంది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేత(YCP Leader), రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు ఇతర నిందితులకు మరోమారు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇది వరకు జారీచేసిన నోటీసులకు వారు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ నోటీసులు జారీ కావడం పై ఇంకా స్పందించలేదు. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Next Story