కేటీఆర్​ను అరెస్ట్​ చేస్తే కాంగ్రెస్​ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారు : కూకట్​పల్లి ఎమ్మెల్యే

by Aamani |
కేటీఆర్​ను అరెస్ట్​ చేస్తే కాంగ్రెస్​ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారు : కూకట్​పల్లి ఎమ్మెల్యే
X

దిశ,కూకట్​పల్లి: హైదరాబాద్​ నగర బ్రాండ్​ ఇమేజ్​ను పెంచినందుకా, హైదరాబాద్​ నగరాన్ని అభివృద్ధి చేసినందుకా కేటీఆర్​ను అరెస్ట్​ చేయడమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. క్యాంపు​ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో మంచి బ్రాండ్​ ఇమేజ్​ తీసుకు వచ్చేందుకు కృషి చేసిన బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​పై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్​ చేసేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ రాష్ట్రాన్ని గత పదేండ్ల కాలంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, అభివృద్దిలో మాజీ మంత్రి కేటీఆర్​ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

గతంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపై ఆందోళనలకు దిగే వారని, తాగునీటి కష్టాలను పరిష్కరించిన ఘనత బీఆర్​ఎస్​, మాజి మంత్రి కేటీఆర్​దేనని అన్నారు. హైదరాబాద్​లో 24 గంటల కరెంట్​ అందించిన ఘనత కేటీఆర్​కే దక్కుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. హైదరాబాద్​ నగరాన్ని అభివృద్ధి చేసినందుకా కేటీఆర్​ను అరెస్ట్​ చేస్తుంది, ఏ తప్పు చేశారని ఏసీబీ విచారణ చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చేందుకు అంతర్జాతీయ ఈ ఫార్ముల రేసింగ్​ను నగరంలో నిర్వహించారని, ఈ ఫార్ములా రేసింగ్​తో తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈ ఫార్ములా రేస్​ ద్వారా రాష్ట్రానికి 7 వందల కోట్ల పై చీలుకు ఆదాయం వచ్చిందని అన్నారు.

కక్ష్య పూరిత ధోరణిలో కాంగ్రెస్​ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని అన్నారు. ఈ ఫార్ములా రేసింగ్​, రింగ్​ రోడ్డు వంకతో కేసీఆర్​, కేటీఆర్​ కుటుంబాలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ విషయాలపై అసెంబ్లిలో చర్చ చేయమని స్పీకర్​ను అడిగాము, అసెంబ్లీ నుంచి బయటకు వచ్చే లోపే కేసు బుక్​ అయినట్టు కాంగ్రెస్​ వాళ్లు మీడియాకు లీకులు ఇచ్చి అరెస్ట్​ చేస్తున్నామని పుకార్లు సృష్టించారని అన్నారు. ఇదే ధోరణి అవలంబిస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్​ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కేసీఆర్​, కేటీఆర్ ​కుటుంబాలకు బీఆర్​ఎస్​ పార్టీ, నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడు అండగా ఉంటారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed