కానిస్టేబుల్‌కు కాబోయే భార్య కిడ్నాప్

by Anukaran |   ( Updated:2020-11-02 07:54:57.0  )
కానిస్టేబుల్‌కు కాబోయే భార్య కిడ్నాప్
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా ఆజాద్‌నగర్‌లో యువతి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల ఓ కానిస్టేబుల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జ్యోతి అనే యువతిని గుర్తు తెలియని వ్యక్తులు స్కార్పియో వాహనంలో వచ్చి కిడ్నాప్ చేశారు. అయితే, గతంలో అవుకు ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో జ్యోతి ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. దీంతో యువతి అతడి వెంటే వెళ్లిందా లేక నిజంగానే ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story