జీడిమెట్ల‌లో యువతి మిస్సింగ్.. ఆ రోజు ఏం జరిగింది?

by Sumithra |   ( Updated:2021-06-06 01:31:29.0  )
జీడిమెట్ల‌లో యువతి మిస్సింగ్.. ఆ రోజు ఏం జరిగింది?
X

దిశ, కుత్భుల్లాపూర్ : యువతి అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్ కు చెందిన శ్రీనుభాషా కుమార్తె రషీదా బేగం (21) డిగ్రీ చదువుతోంది. శనివారం ఎవరికి చెప్పకుండా ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రషీదా ఎంతకూ రాకపోయే సరికి చాలా సేపు చూసిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితు వద్దకు వెళ్లి వెతికారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story