ఫోన్ కోసం… ప్రాణం తీసుకుంది

by Shyam |   ( Updated:2020-09-03 11:22:59.0  )
ఫోన్ కోసం… ప్రాణం తీసుకుంది
X

దిశ, డోర్నకల్: సెల్ ఫోన్ కొనివ్వలేదని ఓ యువతి ఆత్మహత్యకు చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగరం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.‌ పోలీసుల వివరాల ప్రకారం… పెద్ద నాగారం గ్రామానికి చెందిన కూరాకుల వెంకన్న కూతురు కావ్య(19) డిగ్రీ చదువుతోంది.

కొద్ది రోజులుగా తండ్రిని సెల్ ఫోన్ కొనివ్వాలని కోరింది. ఇందుకు వెంకన్న‌ నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.‌ దీంతో ఆ కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story