- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండగపూట తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి
దిశ, వెబ్‌డెస్క్: పండగపూట క్రీడా ప్రపంచంలో విషాదం చోటుచేసుకొంది. సౌరాష్ట్ర యువ బ్యాటర్ అవి బరోట్ గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్‌సీఏ) అధికారికంగా ప్రకటించింది. 29 ఏళ్ల యువ క్రికెటర్ అవి బరోట్ మృతిచెందడం ఎంతో బాధాకరంగా ఉందంటూ ఎస్‌సీఏ తెలిపింది. ” ఈ వార్త విని ప్రతి ఒక్కరం దిగ్భ్రాంతికి గురయ్యాం. అవి బరోట్ అక్టోబరు 15 సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. సౌరాష్ట్ర క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది’’ అంటూ మీడియా ప్రకటన విడుదల చేశారు. బరోట్ మృతిపట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
2011 లో అవి బరోట్ అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2019-20 సీజన్‌కు గానూ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో బరోట్ 38 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అవి కుడి చేతి వాటం కలిగిన బ్యాతారు కావడంతో జట్టులో అతడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవాడని సన్నిహితులు తెలిపారు. ఇక యువ క్రికెటర్ మృతితో క్రికెట్ అభిమానులలో విచారం నెలకొంది.