మూడేళ్లుగా ప్రేమించి.. నాలుగుసార్లు!

by srinivas |
మూడేళ్లుగా ప్రేమించి.. నాలుగుసార్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: మూడేళ్లుగా ప్రేమించాడు.. నాలుగు సార్లు అబార్షన్ చేయించాడు.. పెండ్లి చేసుకో అన్నందుకు మోహం చాటేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లిలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తనను నిజంగానే ప్రేమిస్తున్నాడని నమ్మి సర్వస్వం అర్పించిన యువతిని నట్టేట ముంచాడు. మూడేళ్లుగా తనను ప్రేమ పేరుతో లొంగదీసుకుని చివరికి మోసం చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించి.. న్యాయం చేయాలని వేడుకుంటుంది.

కరుగోరుమిల్లికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన రఘురాం అనే యువకుడిని ప్రేమించింది. అతడూ ప్రేమిస్తున్నట్టే నటించి అవసరం తీర్చుకుంటూ వచ్చాడు. ఇది గ్రహించని బాధితురాలు అతడితో నాలుగు సార్లు గర్భస్రావం దాల్చింది. ఆ తర్వాత యువకుడి మాయ మాటలు విని అబార్షన్ చేయిచుకుంది. ఇక ఇది కాస్తా బాధిత కుటుంబానికి తెలియడంతో అతడిని నిలదీశారు. దీంతో రఘురాం తనను పెండ్లి చేసుకోవాలని యువతి పట్టుబట్టడంతో తప్పించుకొని తిరగసాగాడు. ఒకనోక రోజు ఏకంగా విషయం బయటకు వస్తే చంపేస్తాఅంటూ బాధితురాలి తల్లిదండ్రులను కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రఘురాంతో పెండ్లి చేసిన తనకు న్యాయం చేయాలంటోంది.

Advertisement

Next Story