గొడవలో యువకుడి హత్య.. శవంతో కుటుంబీకుల ఆందోళన

by Aamani |
గొడవలో యువకుడి హత్య.. శవంతో కుటుంబీకుల ఆందోళన
X

దిశ, ఖానాపూర్: ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదం ఓ యువకుడి ప్రాణం తీసింది. యుద్ధవాతావరణానికి దారి తీసింది. ఈ దారుణ ఘటన ఖానాపూర్‌ మండలం సుర్జాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. సదరు యువకుడిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మృతదేహంతో నిందితుడి ఇంటికెళ్లి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు నచ్చజేప్పే ప్రయత్నంలో ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed