అంబేద్కర్ జయంతి వేడుకల్లో అపశృతి..

by Sumithra |
అంబేద్కర్ జయంతి వేడుకల్లో అపశృతి..
X

దిశ, నిజామాబాద్ రూరల్ : జిల్లాలోని సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో విషాద ఘటన జరిగింది. ఈరోజు ఉదయం అంబేద్కర్ జయంతి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. గ్రామ ప్రధాన కూడళి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న జెండాను నీటితో శుభ్రపరుస్తుండగా పైన ఉన్న విద్యుత్తు తీగలను చూసుకోకపోవడంతో అజయ్(25) విద్యుత్ ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ప్రమాదంపై ఎస్‌ఐ పాండే రావ్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఉదయం జెండాను శుభ్రపరుస్తుండగా పైన ఉన్న విద్యుత్ వైర్లను గమనించక అజయ్ విద్యుత్ ఘాతానికి గురై మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా కిరణ్కి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement

Next Story