- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కను తప్పించబోయిన యువకుడు.. అంతలోనే
దిశ, జవహర్ నగర్: కుక్కను తప్పించబోయి బస్సుకు తగిలి ప్రమాదం జరగడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారం ప్రకారం.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సుశీల్ (25) , రూపిసెన్(21)లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపు గూడలో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపూర్ మెయిన్ రోడ్డులో ఇద్దరు యువకులు టూ వీలర్ బైక్ (TS08ET2031)లో వెళ్తుండగా విజయ లక్ష్మి బార్ ఎదుట కుక్క అడ్డురావడంతో తప్పించే ప్రయత్నం చేశారు. దీంతో పక్కనే వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 29జెడ్ 3179) తగలడంతో కింద పడి అక్కడికక్కడే రూపిసెన్(21) దుర్మరణం చెందాడు. మరో యువకుడు సుశీల్ (25) తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.