నాకు, నా భార్యకు వ్యాక్సిన్ వేయొద్దు.. ఆధార్‌ కార్డుతో సహా చెట్టెక్కిన భర్త!

by Shamantha N |   ( Updated:2021-06-26 06:19:35.0  )
నాకు, నా భార్యకు వ్యాక్సిన్ వేయొద్దు.. ఆధార్‌ కార్డుతో సహా చెట్టెక్కిన భర్త!
X

దిశ,వెబ్‌డెస్క్ : టీకా శిబిరాలు ఎర్పాటు చేసి టీకాపై అవగాహన కల్పించినా ఇప్పటికీ చాలా మంది ప్రజలలో వ్యాక్సిన్పై భయం పోవడం లేదు. గ్రామీణ ప్రాతాలలో ఇప్పటికీ చాలా మంది టీకా వేసుకోవడానికి జంకుతున్నారు. వారు వేసుకోకుండా వేసుకుందాం అనుకునే వారి కుటుంబసభ్యులను కూడా వ్యాక్సిన్ వేసుకోనివ్వని ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి టీకాకు భయపడి చెట్టు ఎక్కి కూర్చున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని పతంకాలన్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. పతంకాలన్ గ్రామంలో కరోనా టీకా శిబిరాలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే గ్రామ ప్రజలందరినీ అధికారులు టీకా శిబిరాల వద్దకు వచ్చి టీకా తీసుకోవాలని కోరారు. దీంతో కన్వర్లాల్‌ అనే వ్యక్తి కూడా టీకా కేంద్రానికి వచ్చాడు.

అక్కడే చాలా సేపు క్యూలో నిల్చున్నాడు. అందరికీ టీకా వేస్తుంటే చూసిన అతను ఎమనుకున్నాడో తెలియదు కానీ అక్కడే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. దీంతో అతన్ని గ్రామస్తులు చెట్టు దిగు అని అడగగా నేను టీకా వేయించుకోను, నాకు భయంగా ఉంది అని చెట్టు మీదే ఉండి పోయాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు, అంధికారులు ఎంత చెప్పినా అతను చెట్టు దిగలేదు. అతను చేసిన ఈ పనికి అధికారులు, గ్రామస్తులు షాక్ అయ్యారు. అతని భార్య వ్యాక్సిన్ తీసుకుందామని అనుకున్నా.. ఆమెకు ఆ అవకాశం లేకుండా చేశాడు. తన భార్య ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లి చెట్టెక్కి కూర్చున్నాడు. దీంతో చేసేది ఏమీ లేక ఆమె టీకా తీసుకోలేదు.ఈ విషయం తెలుసుకున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో కన్వర్ లాల్ తోమాట్లాడి టీకా పై వారికి ఉన్న అపోహాలు తొలిగించనాని, వారు టీకా తీసుకోవడానికి ఒప్పుకున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story