టాలీవుడ్ సోనూసూద్ గా మారిన యువహీరో.. శభాష్ అంటున్న నెటిజన్స్

by Shyam |   ( Updated:2021-05-17 23:14:08.0  )
టాలీవుడ్ సోనూసూద్ గా మారిన యువహీరో.. శభాష్ అంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా తో దేశమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. గతేడాది నుండి మొదలైన ఈ మహమ్మారి ఈ ఏడాది ఇంకా తీవ్ర రూపం దాల్చి మానవాళిపై పగ తీర్చుకొంటుంది. రోజురోజూకు పెరుతుగున్న కేసులు, ఆక్సిజన్ లేని హాస్పిటళ్లు, కుప్పతెప్పలుగా శవాలు .. ఇక ఎలాగైనా కరోనా కట్టడి చేయాలని చూస్తున్న ప్రభుత్వాలు.. ఇక ఈ కరొనపై పోరాటానికి మేము సైతం అంటూ సినీ ప్రముఖులు ఆడుకొంటున్న తీరు హర్షదాయకం. సినిమాల్లోనే కాదు నిజ జీవింతంలోను హీరో అనిపించుకున్నాడు రియల్ హీరో సోనూసూద్. కష్టం ఎక్కడవుంటే అక్కడ నేనుంటా అంటూ తనకు తోచిన సాయం చేస్తూ ప్రజలకు కలియుగ దేవుడిలా మారిపోయాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా కరోనా నేపథ్యంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ సోనుసూద్ బాటలోనే నడుస్తున్నాడు.

ఇటీవల కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటినుండి ఆక్సిజన్ లేక, బెడ్లు దొరక్క, ఆర్థిక స్తోమత లేని వారికి సాయం చేస్తూ బిజీ గా మారిపోయాడు నిఖిల్. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ఆక్సిజన్ సిలిండర్స్ – హాస్పిటల్స్ లో బెడ్స్ గురించి సమాచారం అందిస్తున్నారు. అంతేకాదు దీనికోసం నిఖిల్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరికి ఆక్సిజన్ కావాలో, ఎక్కడ బెడ్స్ ఉన్నాయో ఈ బృందం తెలుపుతుంది. కరోనా కష్టకాలంలో నిఖిల్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతోమందికి ఆపన్నహస్తంగా మారింది. ఇక దీంతోపాటు నిఖిల్ భార్య పల్లవి కూడా డాక్టర్ కావడంతో ఈ యువహీరో మరింత ఎక్కువగా కేర్ తీసుకొంటున్నాడు.

తోటివారికి తమకున్నంత లో సాయం చేయడం అనేది ఎంతో గొప్పపని అని, ఇలాంటి కష్టకాలంలో సాయం కోసం ఎదురుచూసేవారికి మేమున్నాం అని అండగా నిలుస్తున్న నిఖిల్ ని నెటిజన్లు అభినందిస్తున్నారు. నిఖిల్ ని టాలీవుడ్ సోను సూద్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ ’18 పేజెస్’, ‘కార్తికేయ 2’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

Advertisement

Next Story