- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బతికుండి బాధించలేను.. మిస్ యూ మమ్మీ డాడీ
దిశ, వెబ్ డెస్క్: “మమ్మీ, డాడీ నన్ను క్షమించండి. లవ్ చేశావ్ కదా.. నన్నే పెళ్లి చేసుకోవాలి అంటున్నాడు. లేకపోతే చచ్చిపోవాలట.. నాకు పెళ్లి జరిగినా వాడు నన్ను హ్యాపీగా ఉండనివ్వడు. నేను బతికి ఉండడం వల్ల మీకు బాధ తప్ప ఏమీ ఉండదు. వాడిని పెళ్లి చేసుకుని మీకు చెడ్డపేరు రానివ్వను. బతికుండి మిమ్మల్ని బాధించలేను. మిస్ యూ మమ్మీ, డాడీ’’ అంటూ అమ్మాయి ఓ మోసగాడిని ప్రేమించిన కారణంగా లేటర్ రాసి సూసైడ్ చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన ఉమ (19) అనే అమ్మాయి ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన రంజిత్‌తో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అయితే ఉమ పెళ్లి విషయం అడుగగా.. రంజిత్ తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు ఉమకు వేరే సంబంధాలు చూడటం మొదలెట్టారు. అయితే రంజిత్ ఉమకు వచ్చిన సంబంధాలను చెడగొడుతూ.. తననే పెళ్లి చేసుకోవాలని ఉమను వేధించసాగాడు. దీంతో మనస్థాపం చెందిన ఉమ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆమె తల్లిదండ్రులు చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఉమ మృతిచెందింది.