యూ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ : మంత్రి హరీష్‌రావు

by Shyam |
యూ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ : మంత్రి హరీష్‌రావు
X

దిశ సిద్దిపేట: విదేశాలలో చదువుకోవాలనే తెలంగాణ విద్యార్థులకు యూరప్ దేశాలు అందిస్తున్న ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌ల గురించి సమాచారం అందిస్తూ విదేశీ విద్య కలను సాకారం చేస్తున్న హైదరాద్‌కు చెందిన లియో ఓవర్సీస్ ఎడ్యుటెక్(LEO OVERSEAS EDUTECH) సంస్థను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అభినందించారు. విద్యాప్రమాణాల స్థాయిని పెంచే దిశగా నూతన ఒరవడితో తెలంగాణలో లియో ఓవర్సీస్ ఎడ్యుటెక్ అనే సంస్థ స్థాపించడం హర్షణీయమన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో సంస్థ ప్రతినిధులతో కలిసి లియో ఓవర్సీస్ ఎడ్యుటెక్ సంస్థ బ్రోచర్‌ను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.

లియో ఓవర్సీస్ ఎడ్యుటెక్ సంస్థ ప్రతినిధి, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ బాలస్తు కిరణ్ క్రిష్ణ మాట్లాడుతూ…జర్మనీ, ఇటలీ వంటి దేశాల్లో చదువుకోవాలనేటువంటి వారికి ఉచిత విద్య తో పాటు ప్రత్యేక సౌకర్యాలను సైతం అందిస్తుoదన్నారు. బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎంఎస్ విద్యను విదేశాలలో అభ్యసించాలనుకునే వాళ్లు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యుతో పాటు స్కాలర్‌షిప్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. యూరప్ దేశాలలో విదేశీ విద్యను అభ్యసించాలని అనుకుని విద్యార్థులు హైదరాబాదులోని తమ సంస్థను సంప్రదించాలని కోరారు. ఫోన్ నెంబర్ లు 9160072200, 8142929595 లలో సంప్రదించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed