- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Royal Enfield: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే దిగ్గజ కంపెనీలు సైతం ఈవీ విభాగంలో కొత్త బైకులను తీసుకొస్తున్నాయి. తాజాగా దేశీయ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సైతం ఈవీ విభాగంలోకి అడుగుపెట్టింది. 1940ల నాటి తన ఒరిజినల్ ఫ్లయింగ్ ఫ్లీ మోటార్‌సైకిల్ ప్రేరణతో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొదటి ఈవీ మోడల్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 బైక్‌ను లాంచ్ చేసింది. ఈ బైకు రెండు సీట్ల ఆప్షన్‌తో రానుండగా, పూర్తిగా రెట్రో ఫ్యూచరిస్టిక్ మోటార్‌సైకిల్‌గా కస్టమర్లకు పరిచయం కానుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసిన తర్వాత ఈ బైకు 100-150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ నుంచి వచ్చే ఈవీ బైకులు అన్నీ ఫ్లయింగ్ ఫ్లీ పేరుమీద విడుదల అవుతాయని రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ బైక్ ధర, ఇతర వివారాలను వెల్లడించలేదు. 2026 ప్రారంభంలో దీన్ని తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇదే సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తక కొత్త బైక్ మోడల్ బేర్‌ను విడుదల చేసింది. 650సీసీతో వస్తున్న ఈ బైక్ ఇంటర్‌సెప్టర్ మోడల్ కంటే 2 కిలోల వరకు తక్కువ బరువు ఉంటుంది. రూ. 3.39 లక్షల(ఎక్స్‌కోరూమ్) ధరలో వచ్చిన బేర్ 650 కోసం నవంబర్ 10 నుంచి బుకింగ్స్ మొదలవుతాయని, ఈ నెల నుంచే డెలివరీ ఇవ్వనున్నట్టు కంపెనీ పేర్కొంది.